Skip to product information
1 of 2

Teeram Chere Daaka - Contemporary Stories of Love in All Its Forms by Dinnesh

Teeram Chere Daaka - Contemporary Stories of Love in All Its Forms by Dinnesh

Regular price Rs. 200.00
Regular price Sale price Rs. 200.00
Sale Sold out
Quantity

తీరం చేరే దాకా అనేది పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ స్త్రీ ప్రధానంగానే ఉంటూ కథనాలు ముందుకి సాగుతాయి. ఇంట గెలిచాక రచ్చ గెలవమన్నారు. మన ఇంట్లో స్త్రీలని గౌరవించుకుని అర్థంచేసుకున్నప్పుడే సమాజంలో ఇతర స్త్రీలని గౌరవించి, అర్థంచేసుకునే మానసిక దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఈ పదమూడు కథలు, గర్భంలో పిండం దశ నుండి జీవితం చివరి దశ వరకు స్త్రీ జీవితంతో ముడి పడి ఉండే కొత్తతరం మానవ సంబంధాల గురించి, ఆ సంబంధాల దృశ్యా పురుషులు స్త్రీలపై తరతరాలుగా మోపబడ్డ ఆంక్షలు, పెత్తనాల గురించి, అవి వారిపై చూపే ప్రభావం గురించి, మారుతున్న ప్రపంచంలో ఆధునిక స్త్రీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, సమస్యల గురించి... ఆధునిక మానసిక దృష్టికోణంలో అర్బన్, సెమీ-అర్బన్ నేపథ్యంలో చర్చించడం జరిగింది. స్త్రీల జీవితాలలో కేవలం పురుషులు చేసే తప్పిదాలే కాకుండా ఆ తప్పిదాల వెనుక స్త్రీల యొక్క పాత్ర, ప్రోద్బలం ఎంతగా ఉన్నదో ఈ కథల ద్వారా శోధించే ప్రయోగం చేయడం జరిగింది. కథలన్నీ స్త్రీ ప్రధానమే అయినా తటస్థ దృక్కోణం నుండి మానవ సంబంధాలని చూసి అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ కథ సంపుటి ప్రధాన లక్ష్యం. కథనంలో వేగం, వైవిధ్యం, వ్యంగ్యం ఈ కథ సంపుటి ప్రధాన లక్షణాలు. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ... ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు. - దినేష్

View full details