Skip to product information
1 of 4

Sulunthee, Tamil Fiction Literature by Ra. Mutthu Nagu, Translated by Bolli Ramaswami Raghupati

Sulunthee, Tamil Fiction Literature by Ra. Mutthu Nagu, Translated by Bolli Ramaswami Raghupati

Regular price Rs. 550.00
Regular price Sale price Rs. 550.00
Sale Sold out
Quantity

Immerse yourself in the captivating world of 'Sulunthee', a masterfully translated Telugu novel from the original Tamil work by Ra. Mutthu Nagu. This compelling piece of fiction, brought to Telugu readers through the skilled translation of Bolli Ramaswami Raghupati, offers a rich narrative experience published by Bala Books. The novel's atmospheric cover art, featuring a mysterious nighttime scene with torch-bearing figures amidst palm trees, hints at the intriguing story within. This literary work represents a significant cultural bridge between Tamil and Telugu literature, making important contemporary Tamil fiction accessible to Telugu readers. The translation maintains the essence and nuances of the original while ensuring the story flows naturally in Telugu. Perfect for literature enthusiasts and readers interested in cross-cultural narratives, this novel promises to be an engaging addition to your literary collection. The book's production quality and thoughtful presentation make it an excellent choice for both personal reading and gifting to literature lovers. సుళుందీ (రగిలే కర్ర) అగ్ని ఆరిపోకుండా వెలుగునిచ్చే ఒక రకం చెట్టు కర్ర. సుకుందీ కర్రలకు నిప్పంటించి దివిటీల్లాగా పెట్టుకోవడం చాలా సేపు ఆ కర్రలు వెలుగుతూ ఉండడం ఈ వెలుతురు కొయ్యల ప్రత్యేకత. అగ్గిపుల్లలు లేని ఆ రోజుల్లో సుకుందీ అత్యవసర నిత్యావసర వస్తువు. ప్రజలు తాటిబెల్లం, ఉప్పు కలిపి నల్లమందు తయారుచేసి సుళ్లుందీతో పేల్చడం రాజరికాన్ని సవాలు చేసింది. అందుకోసం, సుళుందీ, ఉప్పులపై నిషేధం విధించి ఆ రెండిటినీ అంతఃపురం తన గుప్పెట్లో పెట్టుకొన్నది. రాజానుమతి లేకుండా ఎవరైనా సుళుందీ, ఉప్పులను వాడితే కులబహిష్కరణ జరిగేది. అత్యవసర వస్తువులైన ఇవి దొరక్కపోవడం పెను సమస్యగా మారింది. ఆ సమస్యల సుడిగుండం నుండి ప్రజల మనస్సుల్లో రగిలిన సుళుందీ క్రోధాగ్నిగా మారడం సర్వగర్భంగా సవలకు కథావస్తువు అయ్యింది. -డా. వల్లేరి హరినాయుడు విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు సామాజిక సాంస్కృతిక చరిత్రకు ఆధారమైన ఈ మౌఖిక చరిత్రని నేడు చరిత్రకారులు చరిత్రగా గుర్తిస్తున్నారు. ఈ మౌఖిక చరిత్ర ఈ నవలకు ఆధారం. చరిత్రకు, మౌఖిక చరిత్రకు, సృజనాత్మక రచనకు స్వాభావికంగా భేదం ఉంటుంది. సుళుందీ నవలలో ఈ మూడూ ఉన్నాయి. నవలని అర్థంచేసుకోవడానికి వీటిని గుర్తించడం తప్పనిసరి. శ్రీ ముత్తు నాగుగారి విషయ సేకరణ, పరిశోధన, అభివ్యక్తీకరణ గొప్పగా ఉందని నవల చదివిన తర్వాత మీరు ఒప్పుకుంటారు. అంత మంచి నవలని అంతే గొప్పగా అనువదించి మనకు అందించిన మిత్రులు రామస్వామి రఘుపతిగారు ప్రశంసకు పాత్రులు. ఇరువురికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. -నాగపట్ల భక్తవత్సల రెడ్డి విశ్రాంత ఆచార్యులు

View full details