C/o Vaidurya Puram, A Novel by Ramakanth Buka

Regular price Rs. 170.00
In Stock and ready to ship

ఎక్కడైనా గుప్త నిధులు ఉన్నాయంటే ఎక్కడెక్కడినుంచో వచ్చి వాటికోసం రాత్రుళ్ళు చాటుగా తవ్వకాలు జరపడం చూస్తూనే ఉంటాం కదా! మరి ఆ గుప్త నిధులున్న ఊరి పేరే వైడూర్యపురమైతే? వజ్రాలూ వైడూర్యాలూ దొరకబట్టే ఊరికి ఆ పేరొచ్చిందని అనుకోకుండా ఎలా ఉంటాం?

ఈ నవల ఆ 'వైడూర్యపురం' ఊరు ప్రధానంగా జరిగే కథ. అయితే ఇది కేవలం గుప్త నిధుల కోసం జరిగే వేట కాదు. ఇందులో అల్లరి ఉంది, ప్రేమ ఉంది, సస్పెన్స్ కూడా ఉంది. మొదటి నిజాం రాజు ఉల్-ముల్క్ దగ్గర మొదలయ్యే ఈ కథ రెండొందల డెబ్బై సంవత్సరాల తర్వాత మన కథానాయకుడు విజయ్ దగ్గరికొస్తుంది.

అసలు నిజాం రాజుకి వైడూర్యపురంతో పనేంటి? నిజంగానే అక్కడ గుప్త నిధులు ఉన్నాయా? వాటికోసం వెళ్ళినవాళ్ళు కనబడకుండా పోవడం వెనుక ఎవరున్నారు? వైడూర్యపురానికీ కోవిడ్ వ్యాధికీ ఏంటి సంబంధం? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆసక్తికరమైన ట్విస్టులతో పరుగులు పెడుతుందీ కథ.

నిజాం రాజు నిరంకుశత్వం నుంచి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకుందామనుకుంటున్న కార్పోరేట్ శక్తుల పైశాచికత్వం వరకు - అన్ని అంశాలనూ తట్టి లేపి ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతినిస్తుందీ పుస్తకం. నవల చదువుతున్నప్పుడు ఎదురయ్యే అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరకాలంటే మాత్రం చివరిపేజీ వరకూ చదవాల్సిందే.

 

-వి. మల్లికార్జున్