Palukudari Payanam, Tamil Literary Essays by Bava Chelladurai, Telugu Translation by Gillella Balaji Paperback
Regular price
Rs. 250.00
In Stock and ready to ship
జీవితమంటే విసుగ్గా అనిపించిన క్షణం ఏదైనా ఉందా మీకు? పోనీ ఈ సమాజం, దాని చుట్టూ ఉండే రకరకాల గోడలూ లాంటి పదాల మీద ఆసక్తి ఎప్పుడైనా కలిగిందా? అవేమిటో మీలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కూడా అనిపించే ఉంటుంది...
అలాంటప్పుడే మనకు కొంత స్పేస్ కావాలనిపిస్తుంది, మనకు ఓ మాట తోడిచ్చే మెంటార్ అవసరం అనిపిస్తుంది. జీవితం మీద స్పష్టత కోసం వెతుక్కుంటున్న సమయంలో ఇలాంటి పుస్తకం దొరికితే కొంతైనా ఆ వెలితి తీరినట్టే. బవా చెల్లదురై పేరు తెలుగువాళ్లకి సుపరిచితం కాదుగానీ తమిళ సినిమా, సాహిత్యంలో బవా చాలా పరిచితుడు. సున్నితమైన భావంతో జీవితాన్ని విశ్లేషించింట్టుగా అనిపించే ఈ వ్యాసాలు అన్నీ ఒకదగ్గర చదివితే బవా మనకు ఏం చెప్పదలుచుకున్నదీ, మనం జీవితంలో ఎలా ఉండాలనుకున్నదీ కొంత అర్థమవుతుంది.
అలాగని ఇదంతా ఏ అర్థం కాని ఫిలసఫీనో, మరే ఆధ్యాత్మికమార్గాన్నో చెప్పదు. అచ్చంగా మన చుట్టూ ఉండే జీవితాలని చెబుతూనే ఈ ప్రపంచన్ని మనకు అర్థం చేయిస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనిపించినప్పుడు, ఈ ప్రపంచమంటే ఏమిటో కొంత పరిచయం చేసుకోవాలనిపించినప్పుడూ ఈ పుస్తకంలోని ఏదో ఒక వ్యాసాన్ని అలా తెరిచి చూస్తే చాలు... ఏదో ఊరట దొరుకుతుంది.
తమిళంలో ఉన్న ఈ వ్యాసాలని తెలుగువాళ్లకి పరిచయం చేసిన జిల్లేళ్ల బాలాజీ గారి అనువాదం మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఇది కేవలం పుస్తకం కాదు ఈ ప్రపంచాన్ని మీకు అర్థం చేయించే ఒక మిత్రుడు...