Hyderabad to Shikago, Travelogue by Shantisri Benarji
Sale price
Rs. 150.00
Regular priceRs. 225.00
Save Rs. 75.00
In Stock and ready to ship
ఈ యాత్రా చరిత్రలో భిన్న, భిన్న ప్రాంతాలలోని రకరకాల వంటకాలను, భోజన పదార్థాలను ఎంతో హృద్యంగా బ్రాండ్ అంబాసిడర్ లాగా వర్ణించారు. ఎవరికివారు ఈ పుస్తకం 'కొని' 'చదువుకొని' ఆస్వాదించాలన్న ఉద్దేశ్యంతో పేర్కొనడం లేదు. ఈ పుస్తకాన్ని చేత పట్టుకుని ఆ ప్రదేశాలు చూస్తే చక్కని సహాయకారిగా, మార్గదర్శిగా ఉంటుందనడం నిర్వివాదాంశం. ఆ విధంగా శాంతిశ్రీ బెనర్జీ గారు కృతజ్ఞతా పాత్రురాలు, అభినందనీయురాలు. ఆ ప్రాంతాలు చూడలేని నేను వారి రచనా దర్పణంలో వాటిని దర్శించి సంతృప్తి చెందుతున్నాను.
-వెలుదండ నిత్యానందరావు.
కొత్తగా యాత్రలు చేసే వాళ్ళకు ఈ పుస్తకం ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రవేశ రుసుములు, హోటల్ బిల్లుల వంటి ఆర్థికపరమైన వివరాలు కూడా ఇచ్చారు కాబట్టి సందర్శకులు ఆర్థికపరమైన ప్రణాళికను స్పష్టంగా చేసుకోవచ్చు. అంత ఖర్చుతో విదేశాలకు వెళ్లలేనివారు ఈ పుస్తకం వల్ల వీసా లాంటి ఇబ్బందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా బెర్లిన్ నుంచి అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, షికాగో నగరాల దాకా ఖచ్చితంగా చుట్టి రావొచ్చు.