తెలుగు సాహిత్యంలో అరుదైన ప్రేమ కథలు రాశాడు స్కెబాబ. అడుగడుగున సున్నితమైన ప్రేమైక భావనలు... ఉత్కంఠభరితంగా సాగే కథనం.. ఆకర్షణీయ సన్నివేశాలు.. ఆసక్తికరమైన తెలంగాణ భాష, ముఖ్యంగా ఉర్దూ పద సొగసు.. పాఠకుల గుండెలను ఇగ్నైట్ చేసే ప్రేమకథలు స్కెబాబవి" - ఇనాయతుల్లా కథకులు ఈ పుస్తకం ప్రేమను ఆరాధించదు. ప్రేమ పేరిట జరిగే అణచివేతను, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటాన్ని, ఆ పోరాటంలో మిగిలే గాయాలను మనకు చూపిస్తుంది. అందుకే ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది మనందరి గుండెల కింద దాచుకున్న ఒక “సున్నితమైన వేదన”. - మెర్సీ మార్గరెట్ కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత