R.Muttunagu

రామస్వామి ముత్తునాగు తమిళనాడు రాష్ట్రం, తేని జిల్లాలోని వైగై నదీ ఆనకట్ట కోసం భూములను అంకితం చేసిన కుగ్రామమైన కురుంబపట్టి గ్రామంలో నివాసం పారంపర్య నాటు (సిద్ధ) వైద్యవృత్తి. ఒకప్పటి గెండమనూరు జమీందారు సంస్థానంలో వైద్యులుగా ఉండిన కుప్పుస్వామి వైద్యుల మనుమడైన ఈయన 1967లో జన్మించారు. మధురైలోని యాదవ కళాశాలలో మరియు చెన్నైలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఫొటొగ్రఫీ శాఖలో పట్టభద్రులైనారు. శ్రీలంక తమిళుల సమస్యలు మొదలుకొని అనేకమైన ఉద్యమాలలో పాల్గొని ఖైదు చేయబడి జైలు జీవితం కూడా గడిపినవారు. తేని జిల్లాలోని ఆండిపట్టిలో ఫొటో స్టూడియో నడుపుతున్న ఈయన 1994 నుండి 2002 వరకు “దినమలర్” వార్తా పత్రికలో విలేకరిగా పనిచేసారు. ఆ తర్వాత 2002 నుండి 2013 వరకు "జూనియర్ విగడన్" వార్తపత్రికలో పనిచేసారు. తేని, కొడైకెనాల్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల అభిమానాన్ని చూరగొన్నవారు. "జూనియర్ విగడన్” తర్వాత "మల్లిగై మగళ్”, “జన్నల్” పత్రికల కార్యాలయాల్లో పనిచేసారు. “సుళుందీ" నవల ఈయన రాసిన మొదటి పుస్తకం.

Phone : 9443300717, email:  mnagu@gmail.com

సుళుంధీ పుస్తకం సాధించిన విజయాలు :
1. ప్రపంచ తమిళ సాంస్కృతికసంస్థ (కోయంబత్తూరు)-గౌరవ ລ້ (2019).
2. తమిళనాడు కళలు సాహిత్య సంస్థ గౌరవ బిరుదు (2019).
3. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘ బిరుదు (2019).

4. "విగడన్” సాధకుడు బిరుదు (2019).
5. న్యూస్ 18 వార్తా సంస్థ "మకుటం” బిరుదు (2019).
6. హలో ఎఫ్.ఎం. రేడియో సంస్థ “కిరీటం” బిరుదు (2019).
7. ఎస్.ఆర్.ఎం. తమిళ్ ఫోరం "పుదుమైపిత్తన్” బిరుదు (2021).
8. 2019 నుండి 2023 వరకు సాహిత్య అకాడమీ బిరుదు కోసం ఎంపికైన పుస్తకాల పట్టీలో స్థానం.