{"title":"Books by SunkojiDevendrachari","description":null,"products":[{"product_id":"amma-nannaku-అమ్మానాన్నకు-telugu-novel-by-sunkoji-devendrachari-bala-books","title":"Amma Nannaku (అమ్మానాన్నకు) - Telugu Novel by Sunkoji Devendrachari | Bala Books","description":"\u003cdiv class=\"book-description-wrapper\"\u003e\n\u003ch3\u003e“అమ్మ చనిపోయిందిరా.” – “నేను రాను..”\u003c\/h3\u003e\n\u003cp\u003eనలభై ఏళ్లు కలిసి బతికిన భార్య సరిత నిద్రలోనే కన్నుమూసింది. మోహన్ ఢిల్లీలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు మహేష్కు ఫోన్ చేశాడు. ఫోన్లో కొడుకు ఒకే మాట అన్నాడు:\u003cspan\u003e \u003c\/span\u003e\u003cstrong\u003e“సారీ డాడీ.. నేను రాను..”\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఊరంతా ఒకటే మాట – “అమ్మ చనిపోతే కడచూపుకు కూడా రాలేదంటే వాడు మనిషేనా?” కానీ అసలు నిజం ఎవరికీ తెలీదు.\u003c\/p\u003e\n\u003cp\u003eటెన్త్ స్టేట్ ఫస్ట్. ఇంటర్ స్టేట్ ఫస్ట్. ఇంజినీరింగ్ టాపర్. జీతంలో టాపర్. కొడుకు కోసమే బతికిన ఆ తండ్రి ప్రశ్న ఒక్కటే:\u003cspan\u003e \u003c\/span\u003e\u003cem\u003e“ఇంతకూ మేమేం పాపం చేశామని వాడు రాలేదు?”\u003c\/em\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eదశదిన కర్మ రోజు మహేష్ దగ్గర నుంచి ఒక కవర్ వస్తుంది. అందులో ఒక డైరీ లాంటి పుస్తకం. దానికి అతికించిన చిన్న కాగితం మీద:\u003c\/p\u003e\n\u003cblockquote\u003e\n\u003cp\u003e“నాన్నా.. అమ్మ చనిపోయినా నాకు రావలనిపించలేదు. ఎందుకు రావాలనిపించలేదో మీకు వివరంగా ఈ పుస్తకంలో రాశాను. – మీ కొడుకు మహేష్”\u003c\/p\u003e\n\u003c\/blockquote\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eఆ ఉత్తరమే ‘అమ్మానాన్నకు’.\u003c\/strong\u003e\u003cspan\u003e \u003c\/span\u003eమహేష్ ఎందుకు రాలేదు? ఆ జవాబు ఈ నవలలోనే ఉంది.\u003c\/p\u003e\n\u003ch3\u003eపిల్లల్ని పెంచుతున్నామా, లేక పందెం కోళ్లని తయారు చేస్తున్నామా?\u003c\/h3\u003e\n\u003cp\u003eమార్కులు, ర్యాంకులు, క్యాంపస్ ప్లేస్మెంట్లు… ఈ పరుగులో పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా కోల్పోతున్నారో కళ్లకు కట్టి చెప్పే నవల ఇది. ఒక తండ్రి వైపు నుంచి, ఒక కొడుకు వైపు నుంచి – ఇద్దరి నిజం.\u003c\/p\u003e\n\u003ch3\u003eఈ నవల ఎవరు చదవాలి\u003c\/h3\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eతల్లిదండ్రులు\u003c\/strong\u003e\u003cspan\u003e \u003c\/span\u003e– పిల్లల భవిష్యత్తు కోసం పరుగెడుతున్న ప్రతి అమ్మానాన్న.\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eపిల్లలు\u003c\/strong\u003e\u003cspan\u003e \u003c\/span\u003e– హాస్టళ్లలో, కోచింగ్ సెంటర్లలో, దూర నగరాల్లో ఉద్యోగాల్లో ఉన్న ప్రతి కొడుకు, కూతురు.\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eఉపాధ్యాయులు\u003c\/strong\u003e\u003cspan\u003e \u003c\/span\u003e– చదువు అంటే ర్యాంకేనా అని ఆలోచించే ప్రతి ఒక్కరు.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003eచదివిన తర్వాత మీ అమ్మానాన్నకు ఒక ఫోన్ చేయాలనిపిస్తుంది. లేదా ఈ పుస్తకాన్ని వాళ్లకు బహుమతిగా ఇవ్వాలనిపిస్తుంది.\u003c\/p\u003e\n\u003ch3\u003eరచయిత గురించి\u003c\/h3\u003e\n\u003cp\u003eసుంకోజిదేవేంద్రాచారి కడపలో ఉంటారు. వృత్తి రీత్యా జర్నలిస్టు, ప్రవృత్తి సాహిత్యం. మొదటి కథ ‘బంగారుపంజరం’ 1997లో వార్త దినపత్రికలో వచ్చింది. దాదాపు 100 కథలు, 100కు పైగా కవితలు, 7 నవలలు రాశారు. భారతీయ భాషాపరిషత్ (కలకత్తా), పెద్దిభొట్ల సుబ్బరామయ్య స్ఫూర్తి పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. పల్లె బతుకు చిత్రానికి పేరుపొందిన కథకుడు.\u003c\/p\u003e\n\u003ch3\u003eవివరాలు\u003c\/h3\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eపుస్తకం: అమ్మానాన్నకు (నవల)\u003c\/li\u003e\n\u003cli\u003eరచయిత: సుంకోజిదేవేంద్రాచారి\u003c\/li\u003e\n\u003cli\u003eభాష: తెలుగు\u003c\/li\u003e\n\u003cli\u003eISBN: 9788168562837\u003c\/li\u003e\n\u003cli\u003eప్రచురణ: బాలా పుస్తక ప్రచురణలు –\u003cspan\u003e \u003c\/span\u003e\u003cem\u003ebecause some books must exist\u003c\/em\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eఒక కొడుకు రాసిన ఉత్తరం. ప్రతి ఇంటికీ చేరాల్సిన ఉత్తరం. ఈ రోజే మీ కాపీ ఆర్డర్ చేయండి – మీ అమ్మానాన్నకు ఒక కాపీ పంపండి.\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"BALA BOOKS","offers":[{"title":"Default Title","offer_id":68140558909629,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0738\/8728\/5437\/files\/AmmaNannaku_01_cover.png?v=1793856797"}],"url":"https:\/\/balabooks.in\/collections\/books-by-sunkojidevendrachari.oembed","provider":"BALA BOOKS","version":"1.0","type":"link"}